వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Tuesday, July 28, 2026
విజయవాడ  38°C ☀️
రాజకీయం

పవన్ లోకేష్ పంచాయితీ: రావణ్ కూటమిలో చిచ్చు రేపాడా?

📅 July 9, 2026 ✍ News Desk ⏱ 1 నిమిషాల చదువు
పవన్ కల్యాణ్ నారా లోకేష్ రావణ్ కేసు సెక్యూరిటీ పంచాయితీ డీజీపీ కూటమి

ప్రశ్న రావణ్‌ కూటమి రాజకీయాల్లో వేడి పుట్టించాడా? రాజకీయవర్గాల్లో దీనిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రావణ్‌పై ఉపా కేసు, అరెస్టు బయటకు సింపుల్‌గా కనిపిస్తున్నా దీని వెనుక పెద్ద కథే నడిచింది. ఈ వ్యవహారమే ఇప్పుడు పవన్ లోకేష్ పంచాయితీగా మారినట్లు తెలుస్తోంది

బెయిల్‌తో పవన్‌ ఫైర్‌.. పోలీసులపై మండిపాటు

తనను టార్గెట్‌ చేసి మాట్లాడిన రావణ్‌ను అరెస్టు చేయాలని పవన్‌ పట్టు పట్టారు. కానీ ఏం లాభం? పోలీసులు నాలుగుసార్లు కేసులు పెట్టినా వెంటనే బెయిల్‌ వచ్చేసింది. దీంతో షాక్‌ అయిన పవన్‌ ‘ఇంత తేలికగా బెయిల్‌ వచ్చేస్తుందా? కేసులు కూడా సరిగా పెట్టలేరా?’ అంటూ పోలీసు ఉన్నతాధికారులపై మండిపడ్డారు. ఒక దశలో డీజీపీకి నేరుగా వార్నింగ్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

లోకేష్‌ సూచనలే కారణమా?

లోకేష్‌ నుంచి వచ్చిన సూచనల ప్రకారమే నడుచుకుంటున్నట్లు చెప్పడంతో పవన్‌ కోపం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ‘ఈ ఇష్యూ మీద ఓవర్‌గా రియాక్ట్‌ అయితే గవర్నమెంట్‌కే చెడ్డపేరు వస్తుంది’ అని లోకేష్‌ భావించారని, అందుకే వెనుక నుంచి బ్రేక్‌ వేయించారని సమాచారం.

సెక్యూరిటీనే వెనక్కి పంపిన పవన్‌

ఇది పవన్‌కి మరింత కోపం తెప్పించింది. తనను ఇష్టానుసారం తిట్టిన వ్యక్తిని అరెస్టు చేయనప్పుడు ఇక ఈ ప్రభుత్వం ఎందుకని పవన్‌ ఊగిపోయినట్లు ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది. ఆ కోపంలోనే ఏకంగా తన సెక్యూరిటీని వెనక్కి పంపేశారు. రెండు రోజులపాటు సెక్యూరిటీ ఆయన ఇంటి బయటే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం ఇంకా సీరియస్‌ అవుతుండడంతో చేసేది లేక బెయిల్‌ రాకుండా ఉండేందుకు రావణ్‌పై ఉపా కేసు పెట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం లోకేష్, పవన్‌ మధ్య బాగా గ్యాప్‌ పెంచినట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

జనసేన ఎల్పీ మీటింగ్‌.. వెంటనే హైదరాబాద్‌కు పవన్‌

గురువారం విజయవాడలోని ఒక హోటల్‌లో పవన్‌ జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడంతో కూటమి రాజకీయాలు ఇంకా హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే లోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సమావేశం అయిన వెంటనే పవన్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయారు. శుక్రవారం క్యాబినెట్‌ మీటింగ్‌ ఉన్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడం ద్వారా ఆయన అసంతృప్తిని బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లినట్లు జనసేన నేతలు చెబుతున్నా లోపల ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీరియస్‌ మ్యాటరేనా?

కూటమిలో పంచాయితీలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి డీజీపీ లెవెల్‌ దాటి, సెక్యూరిటీ ఇష్యూ దాకా వెళ్లడాన్ని బట్టి ఇది సీరియస్‌ మ్యాటరేనని విశ్లేషకులు చెబుతున్నారు.

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense