బెజవాడ వెస్ట్ పాలిటిక్స్‌లో మళ్లీ హీట్ పెరిగింది. రెండేళ్లుగా ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ కేశినేని చిన్నికి చెక్ పడబోతోందా? పార్టీలో ఆయనపై పెరిగిపోతున్న అసంతృప్తితో బాబు చూపు ఇప్పుడు లోకల్ లీడర్స్ మీద పడిందట. మరి ఆ రేసులో లక్ ఎవరిది?
అసలు చిన్నికి ఎందుకీ పరిస్థితి?
ఎంపీ హోదాలో వెస్ట్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్న చిన్ని.. అక్కడితో ఆగకుండా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వేలు పెట్టడం మొదలుపెట్టారన్నది లోకల్ నేతల ప్రధాన కంప్లైంట్. ప్రతి సెగ్మెంట్లో తన మాటే నెగ్గాలనే తీరుతో స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. తిరువూరు ఎమ్మెల్యేతో నడిచిన గొడవ ఈ వ్యవహారాన్ని ఏకంగా అధిష్టానం గడప వరకు తీసుకెళ్లింది.
ఇక వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరితో చిన్ని కెమిస్ట్రీ అస్సలు వర్కవుట్ కావట్లేదన్నది ఓపెన్ సీక్రెట్. నియోజకవర్గంలో బలమైన పట్టున్న సీనియర్ నేత ఒకవైపు, ఇంచార్జ్ హోదాలో చిన్ని మరోవైపు — ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోవడంతో క్యాడర్ కన్ఫ్యూజన్లో పడిపోయింది.
వీటికి తోడు చిన్నిపై అవినీతి, సెటిల్మెంట్ల ఆరోపణలు కూడా పార్టీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎంపీ హోదాను అడ్డుపెట్టుకుని భూ వ్యవహారాలు, సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారన్న టాక్ నియోజకవర్గం దాటి అమరావతి వరకు చేరిందట. వరుసగా ఇన్ని ఫిర్యాదులు వస్తుంటే హైకమాండ్ ఎంతకాలం చూస్తూ ఉంటుంది? అందుకే వెస్ట్ పగ్గాలను లోకల్ లీడర్‌కు అప్పగించడమే బెటర్ అనే డెసిషన్ దిశగా అధిష్టానం అడుగులు వేస్తోందట.
ఇక రేసు విషయానికి వస్తే
ఫస్ట్ పేరు బుద్ధా వెంకన్న. వెస్ట్‌లో ఆయనది పాత కాపు, సొంత వర్గం స్ట్రాంగ్. కానీ ప్రస్తుతం చేతిలో పదవి లేదు, పైగా ఆయనకు ఇస్తే మిగతా ఆశావహులు ఊరుకుంటారా అన్నది డౌటే.
రెండో పేరు నాగుల్ మీరా. మైనారిటీ వర్గాల్లో గట్టి పట్టు, పార్టీ కూడా వరుసగా రెండు నామినేటెడ్ పదవులిచ్చి ఆయన లాయల్టీకి సీల్ వేసింది. కానీ గతంలో టికెట్ మిస్ అయినప్పుడు ఓపెన్‌గా అలిగిన హిస్టరీ ఉంది — అదే ఆయనకు మైనస్.
మూడో పేరు జలీల్ ఖాన్. మైనారిటీ ఓటు బ్యాంకులో ఆయన నెట్వర్క్ ఇప్పటికీ యాక్టివ్. కానీ గత ఎన్నికల ముందు వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లిన ఎపిసోడ్ పార్టీలో ఇంకా ఫ్రెష్‌గానే ఉంది. ప్లస్ వయసు ఫ్యాక్టర్ కూడా ఉంది.
లాస్ట్ నేమ్ — ఎం.కె. బేగ్. ఒకప్పుడు నాని బ్యాకింగ్‌తో వెస్ట్ టికెట్ కోసం ట్రై చేసిన నేత. కానీ ఆ నాని ఇప్పుడు పార్టీలోనే లేరు. వెనుక నిలబడే గాడ్‌ఫాదర్ లేకుండా బేగ్ ఎంతవరకు వెళ్తారన్నది ప్రశ్నే.
మొత్తానికి వెస్ట్ అంటేనే గ్రూప్ పాలిటిక్స్ హబ్. ఎవరికి ఇచ్చినా మిగతా వాళ్లు భగ్గుమనడం ఖాయం. అందుకే బాబు ఈ డెసిషన్‌ను చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోబోతున్నారట. లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటివరకు వెస్ట్ తమ్ముళ్ల టెన్షన్ మాత్రం కంటిన్యూ!