గుడివాడలో వెనిగండ్ల రాము ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఈ ప్రశ్న ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా నుంచి వచ్చిన ఎమ్మెల్యే.. రెండేళ్లలోనే సీఎం క్లాస్ తీసుకునే స్థాయికి పడిపోయారు.
53 వేల ఓట్ల మెజారిటీ. కొడాలి నాని లాంటి బలమైన నేతపై ఘన విజయం. అమెరికా ఐటీ నేపథ్యం. ఇంత బలమైన స్టార్ట్ తీసుకున్న వెనిగండ్ల రాము. రెండేళ్లు తిరిగేసరికి సీఎం చంద్రబాబు చేతిలో క్లాస్ పీకించుకునే స్థితికి ఎలా వచ్చారు?
సీఎం సమీక్షలో బయటపడిన చిట్టా చిన్నది కాదు. స్ట్రీట్ లైట్లు వెలగవు. తాగునీరు సరిగ్గా అందదు. బస్సు సర్వీసులు అంతంతమాత్రం. ప్రభుత్వ ఆసుపత్రి, హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నం. మధ్యాహ్న భోజనం బాగాలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ వినియోగంలోనూ వెనుకబాటే. పైగా గుడివాడలో గంజాయి సమస్య పెరిగిందన్న అంశం కూడా చర్చకు రావడం. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే చెబుతోంది. నియోజకవర్గంలో శాంతిభద్రతల కోణంలో ఇది ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న అంశం.
మరి ఇదంతా ఒక్క రోజులో జరిగిందా? కాదు. వెనిగండ్ల రాము ఎందుకు ఫెయిల్ అయ్యారో అర్థం కావాలంటే, గుడివాడ రాజకీయాలను కొంచెం వెనక్కి వెళ్లి చూడాలి. అప్పుడు ఈ పరిస్థితికి దారితీసిన కథ మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఎఫిసెన్స్ సిస్టమ్స్ సీఈఓగా అమెరికాలో స్థిరపడిన ఆయన, 2023లో టీడీపీలో చేరి ఏడాదిలోనే ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు అరెస్టు సమయంలో నిరసనల్లో పాల్గొని అరెస్టు కూడా అయ్యారు. పార్టీ పట్ల ఆ నిబద్ధతే ఆయనకు గుడివాడ టికెట్ తెచ్చిపెట్టింది.
కానీ కంపెనీ నడపడం వేరు, నియోజకవర్గం నడపడం వేరు. మున్సిపల్ డ్రైనేజీ నుంచి రేషన్ షాప్ వరకు ప్రతిదానికీ క్షేత్రస్థాయి పట్టు కావాలి. ఏ వార్డులో ఏ సమస్య ఉందో, ఏ కాలనీలో నీళ్లు రావడం లేదో తెలుసుకునే గ్రౌండ్ నెట్వర్క్ కావాలి. ఆ అనుభవలేమి ఖరీదు ఇప్పుడు నియోజకవర్గం చెల్లిస్తోంది. ఆ అనుభవలేమికి తోడైంది మరో సమస్య. గెలిచాక ప్రజా సమస్యల పరిష్కారం కోసమని గుడివాడలో ఆఫీస్ తెరిచారు. కానీ ప్రారంభించిన ఉద్దేశం వేరు, జరుగుతున్నది వేరు అన్న ప్రచారం నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది.
ఎమ్మెల్యే సన్నిహితుడిగా చెప్పుకునే ఒక వ్యక్తి ప్రతి పనికీ రేటు కట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు. రేషన్ డీలర్లకు బెదిరింపుల కథనాలు. వీటిపై అధికారిక విచారణ ఏదీ లేకపోయినా ప్రజల్లో ఎమ్మెల్యే ఇమేజ్ను మాత్రం ఇవి బలంగా దెబ్బతీశాయి. ఒకసారి “ఆఫీసులో దందాలు జరుగుతున్నాయి” అనే మాట ఊళ్లో పాకిందంటే, అది నిజమో కాదో తర్వాత సంగతి. నష్టం మాత్రం జరిగిపోతుంది.
ఇదే సమయంలో లోపల మరో పరిణామం జరుగుతూ వచ్చింది. కొడాలి నానిపై పోరులో రాము వెంట నిలబడి గెలిపించింది టీడీపీ కార్యకర్తలే. టీడీపీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో, గుడివాడలో రాము గెలుపు అంతే ముఖ్యమన్నట్టు వారు పోరాడారు. కానీ గెలిచాక వారే క్రమంగా దూరమయ్యారన్నది పార్టీ వర్గాల మాట.
కీలక సందర్భాల్లో స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం, స్థానిక నేతలతో సమన్వయలోపం. ఎమ్మెల్యేకు, క్యాడర్‌కు మధ్య అగాధం పెరుగుతూ వచ్చింది. క్షేత్రస్థాయి సమాచారం అందించే క్యాడరే దూరమైతే, ఎమ్మెల్యే కంటికి నియోజకవర్గ సమస్యలు ఎలా కనిపిస్తాయి?
అలా అని రాము సైలెంట్‌గా ఏమీ లేరు. “బూట్లు ఎప్పుడు తుడుస్తావ్?” అంటూ కొడాలి నానిపై విసిరిన సవాళ్లు హెడ్‌లైన్స్ అయ్యాయి. దమ్ముంటే గుడివాడకు రావాలంటూ బహిరంగ సవాళ్లు విసిరారు. మీడియా ముందు ఆయన దూకుడుకు కొదవలేదు.
కానీ అదే దూకుడు స్ట్రీట్ లైట్లు వెలిగించడంలో, తాగునీరు అందించడంలో కనిపించలేదన్నదే అసలు విమర్శ. ప్రత్యర్థిపై పంచ్ డైలాగ్‌లు ఓట్లు తేవొచ్చేమో కానీ, పాలన మార్కులు తేవు. సీఎం సమీక్ష ఇదే తేల్చింది.
మరి ఇప్పుడు? రూ.4.77 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని, తాగునీటి సంపు నిర్మాణం పూర్తయితే హెడ్ వాటర్ వర్క్స్ సామర్థ్యం పెరుగుతుందని, బహిరంగ చర్చకు సిద్ధమని రాము చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామన్నది ఆయన వాదన. కానీ శంకుస్థాపన రాళ్లు వేరు, ప్రజల ఇళ్లలో వచ్చే నీళ్లు వేరు.
గుడివాడలో వెనిగండ్ల రాము ఎందుకు ఫెయిల్ అయ్యారు అనే ప్రశ్నకు సమాధానం. ఏ ఒక్క కారణమో కాదు. అనుభవలేమి, ఆఫీస్ వివాదాలు, క్యాడర్‌తో దూరం, మాటలపైనే ఎక్కువ ఫోకస్.. అన్నీ కలిసి ఈ పరిస్థితిని తెచ్చాయి. సీఎం స్వయంగా హెచ్చరించిన తర్వాత అయినా క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందా? లేక వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ ప్రజలే