ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన వాతావరణ మార్పుల కారణంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోనుందని, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో “స్పష్టమైన అల్పపీడనం” (Well Marked Low Pressure) కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు బలమైన ద్రోణి విస్తరించి ఉందని ఆయన పేర్కొన్నారు.
దీని ప్రభావంతో రేపు (శుక్రవారం, జూలై 17) రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.
శుక్రవారం నాడు ప్రధానంగా క్రింది జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు: