ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న CJP విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కూడా కదిలించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నుంచి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ వరకు.. పేపర్ లీక్‌లపై పోరాడుతున్న Gen-Z విద్యార్థులకు మద్దతు ప్రకటించిన స్టార్ల లిస్ట్ రోజురోజుకూ పెరుగుతోంది.
అందరినీ ఆశ్చర్యపరిచింది సల్మాన్ ఖాన్ పోస్ట్. తాను స్టూడెంట్‌గా ఉన్నప్పటి పాత ఫోటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ సందేశం పెట్టారు భాయిజాన్. మెరుగైన విద్యా వ్యవస్థ కోసం దేశ యువత ఏకం కావడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ ఉద్యమం సరైన దిశలో సాగుతోందని, విద్య కోసం పోరాడుతున్న యువత దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. అదే సమయంలో ఇది విద్యార్థులు, విద్యా వ్యవస్థ మధ్య సమస్య అని, దీనికి రాజకీయ రంగు పులమొద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో భారత్ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.
సౌత్ నుంచి కమల్ హాసన్ కూడా విద్యార్థుల పోరాటానికి అండగా నిలిచారు. సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు కూడా మద్దతు ప్రకటించారు. సినీ రంగమే కాదు ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా, సీనియర్ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా విద్యార్థుల వెంట నిలబడ్డారు. మనం దేశంలో ఎన్నో అంశాలకు మద్దతిస్తాం, విద్యార్థుల సమస్యలపై జరుగుతున్న ఈ ఉద్యమానికి కూడా అండగా నిలవాలని బింద్రా పిలుపునిచ్చారు.
మరి ఈ స్టార్ సపోర్ట్ ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుంది? ప్రధాన్ రాజీనామాపై కేంద్రం నిర్ణయం రేపు మధ్యాహ్నం రానుంది. అప్పటివరకు దేశం చూపు ఢిల్లీ వైపే..