వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Tuesday, July 28, 2026
విజయవాడ  38°C ☀️
తెలుసుకోండి

బెజవాడ టూర్ ప్లాన్ చేస్తున్నారా? టాప్ 8 పర్యాటక స్థలాలు ఇవే!

📅 June 29, 2026 ✍ News Desk ⏱ 1 నిమిషాల చదువు

విజయవాడ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడే. కానీ, కృష్ణా నది తీరాన వెలిసిన ఈ చారిత్రక నగరంలో కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు.. ప్రకృతి ప్రేమికులను, సాహస ప్రియులను, చరిత్రను ఇష్టపడే వారిని మైమరపించే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు (Vijayawada Tourist Places) ఎన్నో ఉన్నాయి. వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి కాసేపు సరదాగా గడపడానికైనా, లేదా సరికొత్త అడ్వెంచర్ క్లిక్ చేయడానికైనా బెజవాడ చుట్టుపక్కల ఉన్న బెస్ట్ నాన్-రిలిజియస్ స్పాట్స్ కోసం చూస్తున్నారా? అయితే, కొత్తగా ఏర్పాటైన మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ నుండి ఐకానిక్ భవానీ ఐలాండ్ వరకు.. మీరు తప్పక సందర్శించాల్సిన ఆ 8 అద్భుతమైన పర్యాటక కేంద్రాల పూర్తి వివరాలు, వాటి చరిత్ర, రూట్ మ్యాప్ మీకోసం.


​1. మూలపాడు సీతాకోకచిలుకల వనం (Butterfly Park, Mulapadu)
​ప్రకృతి ఒడిలో రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ల్యాండ్‌మార్క్.
ప్రత్యేకత: దట్టమైన కొండపల్లి అటవీ శ్రేణి మధ్య ఎకో-టూరిజం స్పాట్‌గా దీనిని తీర్చిదిద్దారు. ఇక్కడ వందలాది జాతులకు చెందిన రంగురంగుల అరుదైన సీతాకోకచిలుకలు (Butterflies) స్వేచ్ఛగా విహరిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
హిస్టరీ: పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈ ప్రత్యేక పార్కును అభివృద్ధి చేసింది.
ఎలా వెళ్లాలి (రూట్): విజయవాడ నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) కి సమీపంలో ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఈ అడవి వస్తుంది.
ఎప్పుడు వెళ్లాలి: అక్టోబర్ నుండి మార్చి మధ్య కాలంలో, ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల సమయం అనుకూలం.

​2. భవానీ ఐలాండ్ (Bhavani Island)
​కృష్ణా నది మధ్యలో సాహస క్రీడలకు, వినోదానికి కేరాఫ్ అడ్రస్ ఈ రివర్ ఐలాండ్.
ప్రత్యేకత: 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో స్పీడ్ బోట్స్, జెట్ స్కీయింగ్, కయాకింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ మరియు జిప్ లైనింగ్ అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం వేళ లేజర్ షో ప్రత్యేక ఆకర్షణ.
ఎలా వెళ్లాలి (రూట్): విజయవాడ బస్టాండ్/రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పున్నమి ఘాట్’ నుండి ఏపీ టూరిజం ప్రత్యేక బోట్ల ద్వారా వెళ్లవచ్చు.
ఎప్పుడు వెళ్లాలి: అక్టోబర్-మార్చి శీతాకాలంలో సాయంత్రం వేళలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.


​3. కొండపల్లి కోట (Kondapalli Fort)
​ట్రెకింగ్ ఇష్టపడే యువతకు, చరిత్ర ప్రేమికులకు ఇది ఒక వండర్‌ఫుల్ హిల్ స్పాట్.
ప్రత్యేకత: కొండపై ఉన్న చారిత్రక కోట శిథిలాలు, గజశాల, రాణి మహల్ మరియు చుట్టూ ఉన్న దట్టమైన అడవి అద్భుతమైన ట్రెకింగ్ అనుభూతిని ఇస్తాయి. ఈ ఊరు ప్రపంచ ప్రసిద్ధ ‘కొండపల్లి బొమ్మలకు’ పుట్టినిల్లు.
హిస్టరీ: 14వ కాకతీయుల లేదా ముసునూరి నాయకుల కాలంలో శత్రువుల దాడుల నుండి రక్షణ కోసం వ్యూహాత్మకంగా నిర్మించబడింది.
ఎలా వెళ్లాలి (రూట్): విజయవాడ నగరం నుండి 16 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి పట్టణం ఉంది. అక్కడ నుండి కోటపైకి వెళ్లడానికి ఘాట్ రోడ్డు సౌకర్యం ఉంది.

​4. ఉండవల్లి గుహలు (Undavalli Caves)
​ప్రాచీన భారతీయ శిల్పకళా చాతుర్యానికి సజీవ సాక్ష్యాలు ఈ రాక్-కట్ గుహలు.
ప్రత్యేకత: కొండను తొలిచి నాలుగు అంతస్తులుగా నిర్మించిన ఏకశిలా రాతి కట్టడం ఇది. లోపల చెక్కిన సింహాలు, ఏనుగులు, ప్రాచీన స్తంభాలు మరియు భారీ అనంత పద్మనాభ స్వామి రాతి శిల్పం ప్రధాన ఆకర్షణ.
హిస్టరీ: ఇవి క్రీస్తుశకం 4వ మరియు 5వ వందల సంవత్సరాల నాటి విష్ణుకుండిన రాజుల కాలానికి చెందినవి.
ఎలా వెళ్లాలి (రూట్): విజయవాడ నగరం నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి (గుంటూరు జిల్లా పరిధి) సమీపంలో ఉన్నాయి.

​5. ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage)
​నగరానికి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలిచే అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతం.
ప్రత్యేకత: కృష్ణా నదిపై ఒక కిలోమీటర్ పొడవునా నిర్మించిన ఈ బ్యారేజ్, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఏర్పాటు చేసిన రంగురంగుల ఎల్‌ఈడీ లైట్ల వెలుతురులో మెరిసిపోతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
హిస్టరీ: 1852లో సర్ ఆర్థర్ కాటన్ పర్యవేక్షణలో పాత ఆనకట్ట కట్టగా, 1957లో ఆధునిక బ్యారేజీగా రీమోడల్ చేసి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టారు.
ఎలా వెళ్లాలి (రూట్): విజయవాడ రైల్వే స్టేషన్ మరియు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ (PNBS) కి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

​6. బాపు మ్యూజియం (Bapu Museum)
​డిజిటల్ సాంకేతికతతో చరిత్రను సరికొత్తగా చూపే నాలెడ్జ్ హబ్.
ప్రత్యేకత: పురాతన నాణేలు, రాజుల కాలం నాటి కత్తులు, ఆయుధాలు మరియు అద్భుతమైన బుద్ధుని రాతి శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ వస్తువులను అత్యాధునిక ఆర్గుమెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీ ద్వారా వీక్షించవచ్చు.
హిస్టరీ: 1887లో బ్రిటీష్ కాలంలో నిర్మించిన విక్టోరియా జూబ్లీ మ్యూజియం ఇది. 1921లో పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాను గాంధీజీకి ఇక్కడే సమర్పించారు. ఇటీవల దీనికి ‘బాపు మ్యూజియం’గా పేరు మార్చారు.
ఎలా వెళ్లాలి (రూట్): విజయవాడ నగర నడిబొడ్డున మహాత్మా గాంధీ రోడ్డు (MG Road) లో ఉంది.

​7. గాంధీ హిల్ (Gandhi Hill)
​నగర సౌందర్యాన్ని మరియు ప్రకాశం బ్యారేజ్ అందాలను 360-డిగ్రీల కోణంలో చూపే అద్భుతమైన వ్యూ పాయింట్.
ప్రత్యేకత: సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై 52 ఎత్తైన భారీ గాంధీ స్మారక స్తూపం ఉంది. కొండపై పిల్లల కోసం చిన్న టాయ్ ట్రైన్ (Toy Train) మరియు ప్లానిటోరియం కూడా ఉన్నాయి.
ఎలా వెళ్లాలి (రూట్): విజయవాడ రైల్వే స్టేషన్ వెనుక భాగంలోనే ఈ కొండ ఉంటుంది. స్టేషన్ నుండి ఆటోల ద్వారా కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు.

​8. రాజీవ్ గాంధీ పార్క్ (Rajiv Gandhi Park)
​నగర నడిబొడ్డున ఒత్తిడిని దూరం చేసుకుని ప్రశాంతంగా గడపడానికి చక్కని అర్బన్ పార్క్.
ప్రత్యేకత: పచ్చని లాన్లు, విభిన్న రకాల మొక్కలు, పిల్లల ఆట స్థలంతో పాటు ఇక్కడ సాయంత్రం వేళల్లో ప్రదర్శించే మ్యూజికల్ లేజర్ ఫౌంటెన్ షో పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఎలా వెళ్లాలి (రూట్): ప్రకాశం బ్యారేజ్ ఎంట్రన్స్ వద్ద, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ పక్కనే ఉంటుంది.

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense