వార్తలు & సమాచార హబ్  |  అమరావతి · విజయవాడ · గుంటూరు
Wednesday, July 29, 2026
విజయవాడ  38°C ☀️
టెక్నాలజీ

AI దెబ్బకి 1,400 మంది ఇళ్లకు -పేమెంట్స్ దిగ్గజం Visa షాకింగ్ నిర్ణయం

📅 July 29, 2026 ✍ News Desk ⏱ 1 నిమిషాల చదువు
Visa కంపెనీ లేఆఫ్స్ AI ఎఫిషియెన్సీ

ప్రపంచవ్యాప్తంగా కార్డ్ పేమెంట్స్ నడిపించే దిగ్గజం కంపెనీ Visa షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 7% ఉద్యోగులని తొలగిస్తున్నట్టు ప్రకటించింది అంటే దాదాపు 1,400 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.

కంపెనీ CEO రియాన్ మెక్‌ఇనెర్నీ దీన్ని “ఎఫిషియెన్సీ డ్రైవ్” (కంపెనీ పనితీరుని మరింత వేగవంతం చేయడం) అని పేర్కొన్నారు. కానీ అసలు కారణం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది AI టెక్నాలజీ కంపెనీలో ఎక్కువ పనులని ఆటోమేట్ చేస్తోంది, దీని వల్ల మనుషుల అవసరం తగ్గిపోతోంది.

ఇది కేవలం Visa ఒక్కటే కాదు ఇటీవలి కాలంలో చాలా బిగ్ కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. AI టూల్స్ కస్టమర్ సర్వీస్, డేటా ప్రాసెసింగ్, ఫ్రాడ్ డిటెక్షన్ లాంటి పనులని వేగంగా, తక్కువ ఖర్చుతో చేసేస్తుండటంతో, ఈ డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగుల అవసరం తగ్గిపోతోంది.

కంపెనీ మాత్రం తన ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ విషయంలో ఢోకా లేదని చెబుతోంది రెవెన్యూ, ప్రాఫిట్స్ పెరుగుతూనే ఉన్నాయని అంటోంది. అంటే ఇది నష్టాల వల్ల వచ్చిన లేఆఫ్ కాదు, భవిష్యత్తు కోసం ముందస్తుగా వేసిన స్ట్రాటజిక్ స్టెప్ అని అర్థమవుతోంది.

ఇది గ్లోబల్‌గా టెక్ & ఫైనాన్స్ సెక్టార్‌లలో ఉద్యోగుల భవిష్యత్తుపై పెద్ద చర్చకి దారితీస్తోంది “AI వల్ల ఉద్యోగాలు పోతాయా?” అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.

🔗 ఈ వార్తను షేర్ చేయండి
📰 సంబంధిత వార్తలు
📰 తాజా వార్తలు
📢 Advertisement
300×250
Google AdSense